Monday, August 23, 2010

Mahatma Songs Lyrics

సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి
తల ఎత్తి జీవించు తమ్ముడా
తెలుగు నేలలో మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని
తల వంచి కైమోడ్చు తమ్ముడా
తెలుగు తల్లి నన్ను కని పెంచినాదని
కనుక తులలేని జన్మమ్ము నాదని
త్రైలింగ ధామం...త్రిలోకాభిరామం
అనన్యం...అగణ్యం...ఏదో పూర్వపుణ్యం
త్రిసంధ్యాభివంద్యం....
అహో జన్మ ధన్యం

తల ఎత్తి జీవించు తమ్ముడా
తెలుగు నేలలో మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని

శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకి
శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారము కట్టె నీ సీమకి
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి
పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి

తల ఎత్తి జీవించు తమ్ముడా
తెలుగు నేలలో మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని


తరతరమ్ములు దాటి తరలివచ్చిన మహాకులతపః సంపత్తి నీ వారసత్వం
ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్య సత్వం
మువ్వన్నె జెండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ సొంతం
భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం

తల యెత్తి దీవించు తమ్ముడా
తెలుగు నేలలో మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని

No comments:

Post a Comment